బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన మాటల గారడీలతో.. అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. టెలివిజన్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. ఓవైపు.. రియాల్టీ షోస్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‏తో బిజీ బిజీగా గడిపేస్తుంది. సుమ కేరళ అమ్మాయి అయిన.. ముందుగా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైంది. సినిమాల్లో, సీరియల్లలో నటిస్తూ ఆడియన్స్‏ను అలరించింది. ఆ తర్వాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని బుల్లితెరపై యాంకర్‏గా సెటిల్ అయ్యింది.

By admin

Leave a Reply

Your email address will not be published.