కలెక్టరేట్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిల పక్ష జెఎసికి ఎల్లపుడూ తమ యూనియన్‌ తరుపున సహాయ సహకారాలు అందిస్తామని జివిఎంసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (వైఎస్‌ఆర్‌టియు) ప్రధాన కార్యదర్శి వి.వామనరావు అన్నారు. విశాఖ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 186వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం పున్ణపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎన్‌.పద్మనాభరాజు, గొండు సీతారాం, గుమ్మడి నర్సింగ్‌, బొట్టా ఎర్రాజీ, పల్లా ఆనంద్‌, జివి.కుమార్‌, ఎల్లయ్య, కోండ్రు చిన్న, పల్లా సతీష్‌, జి.వెంకునాయుడు, పి.ఎల్లారావు, భాగ్యం, ఎన్‌ పార్వతి పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.