Manchirevula Farmhouse Casino Case: ఫామ్‌హౌస్ పేకాట కేసులో కొత్త కథలు బయటికి వస్తున్నాయి. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కళావర్ కింగ్ నోటి నుంచి క్యాసినో కథ మొత్తం కక్కిస్తున్నారు పోలీసులు. ఎవరెవరితో లింకులున్నాయి. ఏమేం కేసులు ఉన్నాయి. ఫారిన్ క్యాసినోలకు వెళ్లిన ప్రముఖులెవరంటూ ప్రశ్నలతో సుమన్‌ను పేకాటాడేసుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు.
రంగారెడ్డి జిల్లా ఫాంహౌస్ పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ కస్టడీలో గుత్తా సుమన్ సంచలన విషయాలను బయటపెడుతున్నాడు. మొదట, మామిడి తోటలు, హోటల్స్‌లో పేకాట శిబిరాలు నిర్వహించే గుత్తా సుమన్… ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులతో సుమన్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పేకాటరాయుళ్లను గోవాకు తీసుకెళ్లి క్యాసినో ఆడించేవాడు. గోవాకు తీసుకెళ్లడం ఎందుకు… మనమే నిర్వహిస్తే పోలే అనుకొని ఫామ్ హౌస్ల్ని ఎంచుకుని క్యాసినోలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది.