AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరిహద్దు రాష్ట్రాలతో సంఖ్యత నెరిపే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి.. త్వరలో మూడేళ్ల పూర్తి చేసుకోనున్నారు. ఈ సమయంలో పాలనలో తనదైన మార్కు చూపించే దిశగా పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న సరిహద్దు వివాదం, నీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సమయం కేటాయిస్తే.. వస్తానని ఓ లేఖను రాశారు. సీఎం జగన్ ఆలోచనలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుకూలంగా స్పందించారు. ఒడిశా రమ్మనమని ఆహ్వానించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.