తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో అగ్నిపరీక్షగా మారింది. ఇజ్జత్‌ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్‌ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో ఓటమి రుచి చూపించాలని వైసీపీ ఉవ్వీళ్లూరుతోంది. అటు కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్‌లోకి దింపారు మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా మారింది. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యాక కుప్పంలోనే మకాం వేయాలని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ లోనూ క్లీన్ స్వీప్ చేయాలన్నది ఆయన టార్గెట్. మరోవైపు YCP దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుని కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.