కుప్పం నీదా? నాదా?.. చంద్రబాబు Vs మంత్రి పెద్దిరెడ్డి. ఓ వైపు పంచాయతీ ఎన్నికల ఫలితాల్ని రిపీట్ చేస్తామంటోంది వైసీపీ. మరోవైపు పరువు కోసం పాకులాడుతోంది టీడీపీ. మరి ఈ మున్సిపల్ వార్‌లో ఎవరిది పైచేయి అవుతుంది? కుప్పంపై ఎగరేది ఎవరి జెండా?.

చంద్రబాబుకి అగ్నిపరీక్ష ఈ మున్సిపల్ ఎన్నిక. ఇజ్జత్‌ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై పరిస్థితి ఆయనది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్‌ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పటికే రెండు పార్టీలు ఛైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటించాయి. 16వ వార్డు నుంచి వైసీపీ ఛైర్మన్ క్యాండిడేట్ డాక్టర్‌ సుధీర్‌ నామినేషన్ వేశారు. ఇక తెలుగుదేశం ఛైర్మన్ అభ్యర్థిగా ఇప్పటికే త్రిలోక్‌ను ప్రకటించారు. నామినేషన్లు కూడా జోరందుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.