ఆంధ్రప్రదేశ్‌లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఏంటి? అని ప్రశ్నించారు. దీపావళి రోజున నిర్వహిస్తున్నట్లే.. క్రిస్ట్‌మస్ రోజున ఎన్నికలు నిర్వహిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. గురువారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు అత్యవసరంగా జరుపకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతున్నాయా? అని ప్రశ్నించారు. హిందువుల పండుగ దీపావళి రోజున నామినేషన్లు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రాన్ని పిచ్చోళ్ళ రాష్ట్రంగా చేస్తారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. నామినేషన్ వేసే అభ్యర్థులను అధికార పార్టీకి చెందిన వారు బెదిరిస్తున్నారని, అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఆర్వో లు డ్రామాలు ఆడితే.. జైలుకు వెళతారని, ఎక్కడున్నా కోలుకోలేని దెబ్బ తీస్తామని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమకే తెలియకుండా పోలీస్ కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

By admin

Leave a Reply

Your email address will not be published.