భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భీంద్‌ జిల్లాలోని వీర్‌ఖాది గ్రామం వ‌ద్ద బస్సు కంటైనర్‌లారీ ​ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మ‌రో 14 మంది గాయ‌పడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ ‍ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published.