టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా అరుదైన రికార్డును సాధించాడు. ఆస్ట్రేలియా తరుపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. టి20 ప్రపంచకప్‌-2021 సూపర్‌ 12లో భాగంగా నవంబర్‌4న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించి ఈ ఘనత అందుకున్నాడు.

అంతకముందు 2016 టి20 ప్రపంచకప్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ పాకిస్తాన్‌పై 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.