పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు.