కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29న) గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పు అకాల మరణంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణాన్ని అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబసభ్యులను వరుసగా తెలుగు, తమిళ్ హీరోలు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, రామ్ చరణ్ పునీత్ సమాధిని సందర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. తాజాగా ఈరోజు తమిళ్ స్టార్ హీరో సూర్య పునీత్ సమాధిని సందర్శించారు.. జైభీమ్ సినిమా విడుదల సందర్భంగా బిజీగా ఉన్న సూర్య పునీత్ అంత్యక్రియలకు హజరుకాలేకపోయారు.