ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో  రైతుల బకాయిల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్‌పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి  రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆందోళనపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ రాజకీయం చేయడం మానుకోవాలని రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందని తెలిపారు. రైతులపై లాఠీచార్జ్‌ చేశారని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published.