మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అహంతో మాట్లాడుతున్నారంటూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. ఈటలను టీఆర్ఎస్ నుంచి ఎవరూ పంపలేదని.. ఆయనకు ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయారని అన్నారు. ఈటల రాష్ట్రమంతటా తిరిగితే ఎవరు వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. ఈటల అతిగా ఊహించుకోవడం మానుకుంటే మంచిదన్నారు. బిజెపికి వ్యక్తిగీత ఏజెండా ఉండదని.. ఉమ్మడి ఏజెండానే ఉంటుందన్నారు. ఒక్కరోజలోనే ఈటల రాష్ట్రనాయకుడిగా మాట్లాడుతున్నారని.. ఈటల రాష్ట్ర నేత అయితే బండి సంజయ్‌, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి లాంటి వారి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్నారు. అయితే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.