హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు పార్కుల అభివృద్ధి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కార్పొరేషన్లోని నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్లలో పార్కులు ఉండగా ఎక్కువగా ప్రగతినగర్లోనే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో కొన్ని పార్కుల నిర్వహణ, అభివృద్ధి బాగానే ఉన్నా ఎక్కువ పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పలు పార్కుల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పార్కుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కుల అభివృద్ధికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా ప్రయోజనం కనపించడం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు