T20 world Cup 2021: Virat Kohli On India Beat Scotland By 8 Wickets: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో స్కాట్లాండ్పై అద్భుత విజయం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఆసాంతం ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించి గెలుపు సొంతం చేసుకున్నామన్నాడు. తదుపరి మ్యాచ్‌లోనూ ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
కాగా సెమీస్ చేరాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడవలసిన స్థితిలో ఉన్న కోహ్లి సేన.. నవంబరు 5న దుబాయ్‌లో స్కాట్లాండ్తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 85 పరుగులకే స్కాట్లాండ్ను ఆలౌట్ చేసింది. ఇక.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేటును మెరుగుపరుచుకుంది.