కల్యాణపులోవను పుణ్య క్షత్రంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం రావికమతం మండలం కొత్తకోటలో పెనుగొండ వాసు ఇంటి వద్ద మండల వైఎస్సార్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజక వర్గంలో ముఖ్య మైన పుణ్య క్షత్రంగా పేరొందిన కల్యాణపులోవను అన్ని విధాలా ఆధ్యాత్మికంగానూ, పర్యాటకంగాను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సుమారు రూ.60లక్షలతో ఆలయం వద్ద ముఖ మండపం, ప్రహరీ నిర్మాణం చేయగా మరో రూ.58 లక్షలతో రోడ్డు మర్మతులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. దొండపూడి చెక్‌ పోస్టు నుంచి సుమారు 8 కిలోమీటర్లు మేర అర కిలోమీటర్‌కు ఒక ముఖ ద్వారం చొప్పున నిర్మాణానికి నిధుల సేకరణకు ప్రణాళిక చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకుగాను కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పరిధిలో కొత్తకోట, కొత్తపట్నం, గంపవాణిపాలెం, చీమలపాడు, ధర్మవరం, దొండపూడి, టి.అర్జాపురం, మత్సవాని పాలెం, కన్నంపేట, వమ్మవరం తదితర సుమారు పది గ్రామాల ప్రజల భాగస్వామ్యం కావాలని కోరగా.. ఒక్కో గ్రామం నుంచి ముఖద్వారం నిర్మాణానికి సొంతం నిధులు సమాకుర్చుతామని, ఆయా గ్రామాల నాయకులు ప్రకటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.