రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం చోడవరంలో ఆందోళన చేపట్టారు. ఏ ఐటియుసి జిల్లా నాయకులు వామన మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు కొంతమేరకు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తగ్గించినా ఏపీలో మాత్రం ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.