సమస్యలు పరిష్క రించాలని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకి మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంలో చీడికాడ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సిహెచ్‌ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ రఘువర్మ హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మోడల్‌ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు రోజు వారి కూలీలు కన్నా దీనంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయులకు పని భారం తగ్గిస్తే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలమని తెలిపారు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించి, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. మోడల్‌ స్కూల్స్‌ను విద్యా శాఖలో విలీనం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏపిటిఎఫ్‌ పూర్వాధ్యక్షులు తమరాన త్రినాధరావు, మండల అధ్యక్షులు జిపిఎ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి పాటూరి వరాహమూర్తి, స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.