స్వప్న సురేష్.. కేరళలో ఈ పేరు ఓ సంచలనం. గత ఏడాది కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ ప్రధాన నిందితురాలు. ఈ కేసులో అరెస్టై 16 మాసాలుగా కారాగార జీవితం గడుపుతున్న ఆమె.. శనివారం తిరువనంతపురం జిల్లా ఆట్టకులంగర జైలు నుంచి విడుద‌లయ్యారు. స్వప్న సురేష్ తల్లి బెయిల్ కాపీతో జైలుకు చేరుకుని.. ఆమెను విడిపించుకుని తన వెంట తీసుకెళ్లారు.

కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), కస్టమ్స్ శాఖ దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) కింద గ‌త ఏడాది జూలై 11న స్వప్న సురేష్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. ఇటీవ‌ల ఆమె బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా న‌వంబ‌ర్ 2న కేర‌ళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీక‌త్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఎన్ఐఏ అభియోగాలు మోపినట్లు స్వప్న సురేష్‌కు తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు ప్రాథమిక నిర్థారణ కాలేదని కోర్టు తెలిపింది.

By admin

Leave a Reply

Your email address will not be published.