ఆల్కహాల్ అలవాటు ఉంటే ఎంతటి గొప్ప వ్యక్తైనా చిత్తయిపోతాడు. సమాజం దృష్టిలో చులకన అవుతాడు. మద్యం మత్తులో తెలియకుండానే తప్పులు జరిగిపోతుంటాయి. తాజాగా ఓ మాజీ ఎంపీకి లిక్కర్ విపరీతమైన డ్యామేజ్ చేసింది. తాగి వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లిన ఫన్నీ సీన్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ తాజాగా తమిళనాడులో రియల్‌గా జరిగింది. పైగా వెళ్లింది నార్మల్ వ్యక్తి కూడా కాదు. ఓ మాజీ ఎంపీ. సొసైటీలో బలమైన నేతగా ఉన్న వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్​ దీపావళి పండుగరోజు ఫుల్‌గా లిక్కర్ సేవించారు. ఆయనకు మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఈ క్రమంలో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ గుర్తుతెలియని నివాసంలోకి ప్రవేశించారు. దీనితో ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి ఓనర్.. గోపాలకృష్ణన్​పై దాడి చేశాడు. అంతేగాక ఈ ఘటనను సెల్​ఫోన్​లో రికార్డు చేశాడు. అనంతరం కూనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని, అతను అర్థనగ్నంగా వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేశాడని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. తమతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని.. ఆయన మాజీ ఎంపీ అని తెలియదని పేర్కొన్నారు. అనంతరం ఆయనను కూనూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా, గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొనడం గమనార్హం.

By admin

Leave a Reply

Your email address will not be published.