ఉక్కునగరం : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కళాక్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యుసి కోశాధికారి ఎన్‌ శేషగిరిరావు స్మారక దినం అంతర్విభాగా నాటికల పోటీలు -2021 మొదటి రోజు ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు రోజుల పాటు ఈ ప్రదర్శనలు ఉంటాయి నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ గంగారావు, హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన సిజిఎం సత్యం, ప్రజానాట్యమండలి సభ్యులు పాల్గొని ప్రారంభించారు. శేషగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మొదటిరోజు దేవుడు ఇచ్చిన తీర్పు, నాన్న నువ్వు సున్నా రెండు నాటకాలను ప్రదర్శించారు. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.