టి20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్లో అక్తర్ మాట్లాడుతూ.. ”అఫ్గాన్‌తో పోరులో కివీస్ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్ అభిమానులు ఊరుకోరని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. టి20 ప్రపంచకప్‌కు ముందు భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి పాక్ అభిమానులు మరిచిపోలేదు. పాక్, కివీస్ చేతిలో దారుణ పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్పై ఘన విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది.