భాజపా నేతలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రైతుల బతుకులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతున్నారని అంటూ రైతులు తమ పొలంలోనే కూలీలుగా బతకాలా? అని ప్రశ్నించారు. రైతుల కోసం పార్లమెంటు దద్దరిల్లేలా చేస్తామని, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం కోటా కోసం ధర్నా చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే తనతో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, దిల్లీలో ధర్నా చేస్తామని వెల్లడించారు. వేలాదిమందితో వెళ్తామని, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు. పంజాబ్‌లో నూరుశాతం ధాన్యం సేకరణ చేసి, తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.