దేశంలో కరోనా మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై.. వచ్చే జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సందీప్‌ మండల్‌, నిమలన్‌ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్‌ పాండాలు రాసిన అధ్యయన పత్రం.. ‘జర్నల్‌ ఆఫ్‌ ట్రావెల్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైంది. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని అందులో పేర్కొన్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు అధికమవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.