ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. కిలోమీటరుకు 25 నుంచి 30 పైసల వరకు పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించడమే తరువాయి. ఈ వారంలో ఎప్పుడైనా పెంపుపై అధికారిక ప్రకటన వెలువడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు రూపొందించిన ప్రకారమే ఛార్జీల పెంపు ఉంటుందా.. లేదా మార్పులు.. చేర్పులు చేస్తారా? అన్నది వేచి చూడాలి. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఛైర్మన్‌ గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ కారణాల వల్ల సంస్థ పీకల్లోతు అప్పులు, నష్టాల్లో కూరుకుపోయింది. తాజాగా కేంద్రం డీజిల్‌పై లీటరుకు రూ.10 తగ్గించడంతో కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ నష్టాలు తగ్గాలంటే ఛార్జీలు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.