పాపికొండలు విహార ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి వద్ద ఆదివారం పర్యాటక బోట్లను రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మితో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. బోట్లలోకి వెళ్లి యాత్రికులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకుల భద్రతే లక్ష్యంగా పాపికొండల విహారయాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. ‘పర్యాటక బోటుకు ముందు ఓ ఎస్కార్టు బోటు బయలుదేరుతుంది. ఈ బోటు తిరిగొచ్చే వరకూ శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ ద్వారా నిరంతరం పోశమ్మగండిలోని కంట్రోల్ రూమ్‌కు పర్యాటకుల సమాచారం చేరుతుంది. ఈ యాత్రకు ఆన్లైన్లో టికెట్ల ధర ఒకేరకంగా నిర్ణయించాం