జెన్‌కో నిరర్థక ఆస్తుల జాబితాలోకి వెళ్లింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఈసీ నుంచి తీసుకున్న రుణాలపై వాయిదాల చెల్లింపునకు నిర్దేశిత గడువు దాటి 90 రోజులు గడచినా జెన్‌కో చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జెన్‌కో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్‌పీఏ జాబితాలోకి జెన్‌కో చేరలేదని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయడంతో భవిష్యత్తులో కొత్త రుణాలు పొందటం కష్టం అవుతుందన్నారు. విద్యుత్‌ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ), ఆర్‌ఈసీల నుంచి సుమారు రూ.9వేల కోట్లను జెన్‌కో రుణాలుగా తీసుకుంది. వాయిదా చెల్లింపు కోసం నిధులు సర్దుబాటు చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published.