విశాఖ ఏజెన్సీలోని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి చలి గాలులు అధికమవడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపధ్యంలో చలిగాలులు మన్యం వాసులను వణికిస్తున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో సాయంత్రం 5గంటల నుంచే చలిగాలుల తీవ్రత నెలకొంది. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తుంది. సోమవారం ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడలేదు. సూర్యోదయం ఆలస్యమైంది. జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.7, పెదబయలులో 11.1, అరకులోయలో 11.4. ముంచంగిపుట్టులో 11.5, హుకుంపేటలో 12.1, పాడేరులో 12.5. చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులు వీస్తుండడంతో మన్యం వాసులంతా ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.