Minister KTR on Union Govt.: అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు చేయూతను అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని మంత్రి కేటీ రామరావు మండిపడ్డారు. ఆర్థికంగా ఆదుకోవల్సిన కేంద్రం చిన్న చూపు చూస్తోందన్నారు. అభివృద్ధిలో దూసుకెళ్తోన్న తెలంగాణ పట్ల బీజేపీ సర్కార్ మెతక వైఖరి అనుసరిస్తుందన్నారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో సీఐఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅథిగా హాజరయ్యారు. బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ స్టార్టప్, బెస్ట్ ఎక్స్ పోర్ట్ కేటగిల్లో అవార్డులను కేటీఆర్ అందజేశారు. బెస్ట్ ఇన్నోవేషన్ – గోల్డ్ కేటగిరీలో 2021 సంవత్సరానికి గాను ఇండస్ట్రీస్ అవార్డును భారత్ బయోటెక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్ర్రైవేటు సంస్థలకు అవార్డులు అందజేసిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రం పట్ల కేంద్రం తీరును నిరసించారు.