Electric Vehicles: పెరుగుతున్న ఇంధన ధరల నేపధ్యంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఫేమ్ (FAME) పథకం కింద ఈ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్నారు. అయితే, దీని తర్వాత కూడా వాటి ధర పెట్రోల్.. డీజిల్ వాహనాల కంటే చాలా ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాలతో సమానంగా ఉంటాయని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. డెన్మార్క్‌లోని ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన వెబ్‌నార్‌లో గడ్కరీ మాట్లాడుతూ పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందువల్ల, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతారు. కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే విధానాలను అవలంబిస్తాయి. దీంతో వారి ఖర్చు కూడా తగ్గుతుంది. రెండేళ్ల తర్వాత అదే ధరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.