హైదరాబాద్‌ నగరంలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గోల్కొండ పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ సమాచారం అందుకున్న పోలీసులు ఆ తర్వాత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ నోట్లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న సంచుల్లో రూ.2 వేలు, రూ.5 వందల కరెన్సీ నోట్లు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారానికి సుదర్శన్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లంగర్ హౌస్‌కు చెందిన లక్ష్మి అనే మహిళను నకిలీ నోట్లతో బురిడి కొట్టించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు అప్పుగా నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు సుదర్శన్ ప్లాన్ రచించాడని పోలీసులు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.