ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.