దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ ‘డప్పుల మోత’ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టింది. నగరంలోని ఎల్బీ స్టేడీయం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు భయం మొదలైంది. డప్పులమోత ఇక ఆగదు. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాల్సిందే. కేసీఆర్ గద్దె దిగాల్సిందే, దళితుడిని సీఎం చేయాల్సిందే. నా తల నరకడానికే మీరు సీఎంగా ఉన్నారా?. మీరు నరికితే నరికించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసం నేను తల నరుక్కోవడానికి సిద్ధం. సమయం, స్థలం డిసైడ్ చెయ్.. నరికించుకోవడానికి వస్తా’ అని బండి సంజయ్ అన్నారు.