సమంత.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన సన్నిహితులతో కలిసి విదేశి టూర్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది. కేవలం ఫోటోస్.. పర్సనల్ విషయాలు మాత్రమే కాకుండా.. ఇటీవల గత కొన్ని రోజులుగా ఆసక్తికర కోట్స్ కూడా సామ్ షేర్ చేస్తుంది. మై మామ్స్ సెడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. అయితే విడాకుల ప్రకటన తర్వాత.. నిశ్బబ్దం వహించిన సామ్ ఆ తర్వాత యాక్టివ్ అయ్యింది.. ప్రస్తుత కఠినమైన పరిస్థితుల నుంచి తనను తాను బయటపడేందుకు కాస్త సమయం ఇవ్వాలని నెటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది సామ్..