అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ తీపికబురు చెప్పింది. విశాఖపట్నం నుంచి అయ్యప్ప స్వామి సన్నిధి శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఆలయాన్ని సందర్శించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కోసం APSRTC విశాఖపట్నం రీజియన్ నుంచి శబరిమలకి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ద్వారకా బస్ స్టేషన్ (ఆర్టీసీ కాంప్లెక్స్)లో ప్రత్యేక బస్సుల బుకింగ్ కోసం కౌంటర్‌ను ప్రారంభించారు. విశాఖపట్నం ప్రాంతం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఇంద్రా, అమరావతి బస్సు సర్వీసులతో 5, 6, 7 రోజుల పర్యటనల ప్యాకేజీలను అయ్యప్ప భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.