భారతదేశంలోనే పారిశ్రామిక కేంద్రాల్లో ముఖ్యమైనది విశాఖపట్నం… అని చెప్పడంలో ప్రతి ఒక్క విశాఖ వాసీ గర్వపడతాడు. ప్రకృతి సిద్ధమైన అందాలేగాక.. శ్రమించే వారికి సేద తీరే అతిపెద్ద కర్మాగారంగా విశాఖ ఎదిగింది. 1930వ దశకంలో ఓడరేవు ఏర్పాటుతో హిందూమహాసముద్రం ద్వారా జరిగిన రవాణాతో పారిశ్రామిక ప్రగతికి బీజాలు పడ్డాయి. తొలుత పోర్టు సిటీగా ఉండే విశాఖ… స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు జరిగినాక స్టీల్‌సిటీగా మారడంతో విశాఖ రూపురేఖలే మారిపోయాయి. విశాఖ నగరంతో పాటు కార్మికోద్యమ పోరాటాలు, ప్రజా ఉద్యమాల కూడా ఎగసిపడుతూనే ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్‌, షిప్‌యార్డు, బిహెచ్‌పివి, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌లను పరిరక్షించుకునే అనేక ఉద్యమాలు సిపిఎం ప్రమేయం లేకుండా ఊహించజాలం. ఉక్కు కర్మాగారం కోసం 1960వ దశకంలో ఆంధ్రుల్లో ప్రారంభమైన ఆలోచన… 1966లో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన పోరులో సిపిఎం నిర్వహించిన పాత్ర, చేసిన కృషి అనిర్వచనీయమైనది. సముద్ర రవాణా ఈ పరిశ్రమల్లో ప్రగతి ఊపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పిసిఎల్‌, షిప్‌యార్డు, కోరమాండల్‌, గతంలో హిందుస్థాన్‌ జింక్‌ వంటి వాటిల్లో అభివృద్ధి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సాగింది.

By admin

Leave a Reply

Your email address will not be published.