ములగాడ : పెదగంట్యాడలోని నడుపూరు కళావేదికలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే సిపిఎం 11వ నగర మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను మల్కాపురం కమిటీ ఆధ్వర్యాన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడుతూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం మహాసభలు జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాసభల సందర్భంగా 13వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు, ఎంవిఎస్‌ శర్మ, విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు హాజరవుతారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కోసం బహిరంగసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.పెంటారావు, పివి.భాస్కర్‌, ఆర్‌.విమల, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.