ఏపీలో ఎయిడెడ్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తిరిగింది. ప్రతిపక్షం సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చరచ్చవుతోంది. విశాఖలో రాజుకున్న నిప్పు ఇప్పుడు రాష్ట్రమంతా అంటుకుంది. ఎయిడెడ్ పాలసీని వ్యతిరేకిస్తూ స్టేడ్ వైడ్‌గా టీడీపీ పోరాటాలు చేస్తోంది. ఎక్కడైతే స్టూడెంట్స్ రోడ్లపైకి వస్తున్నారో… అక్కడ వాళ్లకు అండగా నిలుస్తోంది. ఇదే, ఇప్పుడు పొలిటికల్ రచ్చకు కారణమైంది.
ఎయిడెడ్ వివాదంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ముందు ఆ జీవోలో ఏముందో చదువుకో అంటూ పంచ్‌లు పేల్చారు. లోకేష్ బుద్ది లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏయిడెడ్ పాఠశాలను బలవంతం ఎవరు చేయలేరన్నారు. ఎయిడెడ్ జీవోను అసలు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేసిన మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భ్రష్టు పట్టించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.