మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్‌లో మార్పు చేస్తూ ఎక్సైజ్ శాఖ జీవో జారీ చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించింది. రూ.400-2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్ విధించింది. రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్‌ ఉండనుంది. రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్‌ వేయనున్నారు. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. రెడీ టు డ్రింక్‌లపై 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.