హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు.