పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.నిలిపేసిన ఎంపీ-లాడ్స్ నిధులను పునరుద్ధరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. న్యూఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశం అనంతరం ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రూ. 5 కోట్లు ప్రతి ఎంపీకి అందుతాయని ఆయన వెల్లడించారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని కేటాయించుకోవచ్చన్నారు.