పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై రాజకీయ రగడ రాజుకుంది. బీజేపీకి మద్దతిచ్చే వాళ్లకే అవార్డులు ఇస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు కురిపిస్తున్నాయి. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.

క‌రోనా మ‌హమ్మరి స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజ‌ల‌కు స‌హ‌యం చేసిన సోనూ సూద్‌కు ప‌ద్మ అవార్డు ఇవ్వకపోవ‌డం ప‌ట్ల ప‌లువ‌రు రాజకీయ నాయక‌లు, ప‌లువురు సెల‌బ్రెటీలు, సామాన్యులు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. సోనూ సూద్‌ ప్రజా సేవ చేశారనని కాని, కంగ‌నా సినిమాలలో న‌టించ‌డం త‌ప్ప ప్రజ‌ల‌కు ఎలాంటి స‌హాయం చేసిందని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజ‌ల‌కు స‌హాయం చేయ‌లేదు గానీ.. బీజేపీకి చాలానే స‌హ‌యం చేసిందని అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కంగ‌న రనౌత్‌కు ప‌ద్మ శ్రీ అవార్డు తో స‌త్కరించింద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ విమ‌ర్శల స్థాయి రోజు రోజు కు పెరిగిపోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.