తూర్పు గోదావరి జిల్లా నుంచి వలసవచ్చి గచ్చిబౌలిలో స్థిరపడిన షేక్‌ మహ్మద్‌ రఫీ సోషల్‌మీడియాలో కార్తీక్‌ వర్మగా మారిపోయాడు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మంది యువతులకు ఎర వేశాడు. ప్రేమ, సహజీవనం, పెళ్లి పేరుతో వారిని నమ్మించాడు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగి అందినకాడికి దండుకుని నిండా ముంచాడు. ఈ ఘరానా మోసగాడిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు బుధవారం
వెల్లడించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.