తొలి తెలుగు ఓటీటీ ఆహా మరో ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌కు వేదిక కానుంది. ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిందే ‘3 రోజెస్‌’ వెబ్‌ సిరీస్‌. మగ్గీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. అంటే సిరీస్‌ మొత్తం మారుతి పర్యవేక్షణలోనే తెరకెక్కిందన్నమాట. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరి ముగ్గురి చుట్టూ తిరిగే కథే ఈ ‘3 రోజెస్‌’. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ ఆహా వేదికగా నవంబర్‌ 12 నుంచి టెలికాస్ట్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.