ఆనంద్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్పక విమానం’. ‘దొరసాని’, ‘మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌’తో విజయ్‌ దేవరకొండ సోదరుడిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఆనంద్‌. ఇక పుష్ఫక విమానంతో నటుడిగా ఆనంద్‌ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. పెళ్లి గురించి ఎన్నో కలలు కన్న ఓ కుర్రాడు.. తీరా వివాహం అయిన కొద్ది రోజులకే భార్య వదిలేసి పోతే అప్పుడు సమాజం నుంచి ఆ కుర్రాడికి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. లేచి పోయిన భార్య గురించి ఎవరికీ చెప్పుకోకుండా ఎలాంటి బాధను అనుభవించాడు.? లాంటి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.