సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై వెల్లువలా ఫిర్యాదులు వస్తున్నాయి. రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో బాధితులు క్యూ కడుతున్నారు. నార్సింగి పీఎస్‌లో అజమ్ షరీఫ్ ఫిర్యాదు చేశారు. Nri యలమంచలి కేశవరావుకు చెందిన 11 ఎకరాల భూమిపై శ్రీధర్ రావ్ కన్ను పడింది. జేసీబీలతో ట్రేస్ పాస్‌కు యత్నించారు శ్రీధర్ రావ్. దీంతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో మరికాసేపట్లో కేసులు నమోదు చేయబోతున్నారు పోలీసులు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. నానక్ రామ్ గూడలోని 5 ఎకరాల స్థలం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 300 కోట్ల రూపాయలకు 5ఎకరాల భూమి కొనుగోలు చేశారు శ్రీధర్ రావు.

By admin

Leave a Reply

Your email address will not be published.