రాష్ట్రాల అభివృద్దిలో గవర్నర్ల పాత్ర చాలా కీలకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రజా సమస్యలను తీర్చడానికి చురుగ్గా పనిచేయాలని గవర్నర్ల సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్‌ పదవికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి గవర్నర్‌ ఓ స్నేహితుడిలా ఉంటారని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంరయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథులుగా హాజరు కాగా, అన్ని రాష్ట్రాల గవర్నర్లు , కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు.

గవర్నర్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని రాష్ట్రపతి.. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోవింద్ సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. దేశ లక్ష్యాలను సాధించడానికి ప్రజలను భాగస్వామ్యం చేయడంలో గవర్నర్ల పాత్ర కీలకమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలపై గవర్నర్లు ఎక్కువ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. కరోనాపై పోరులో గవర్నర్లు కూడా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.