Telangana Assembly Session 2021: ప్రతిపక్షాలు చేస్తున్నట్టు దళితబంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll Election ) కోసం రూపొందించింది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో జరిగిన ( Assembly Session ) చర్చలో స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ వర్గాల సాధికారత కోసం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని ఎప్పటి నుంచో తమ ప్రభుత్వం ఆలోచించిందని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి గతేడాదే దళితబంధును (Dalitha Bandhu) ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ కరోనా (Coroan) కారణంగా వాయిదా పడిందన్నారు. రాష్ట్ర ఆదానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చినందున ఈ పథకానికి కేటాయించలేక పథకాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. కేవలం పైలెట్ ప్రాజెక్టుగా మాత్రమే హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసినట్టు తెలిపారు. అంతకుముందే వాసాలమర్రి (Vasala Marri Village) గ్రామంలో లబ్ధిదారులకు పది లక్షల రూపాయలు అందించిన విషయం ప్రతిపక్షాలు గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published.