కుప్పంలో టీడీపీ కొత్త నాటకానికి తెరలేపింది. మున్సిపల్ కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులతో దాడి చేయించి వైఎస్సార్ సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సానుభూతి పొంది మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని పన్నాగం పన్నింది. ఎంతచేసినా ఓటర్ల నుంచి స్పందన కనిపించలేదు. దీనికితోడు పార్టీలో 30 ఏళ్లుగా కీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు చేసిన అవినీతి, అక్రమాలు శాపంగా మారడంతో టీడీపీ కేడర్ డీలాపడిపోయింది.