విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఆస్తుల వాల్యుయేషన్‌ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ ఈ నెల 12న స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లే అన్ని గేట్ల దిగ్బంధం కార్యక్రమానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికులంతా ఏకమై స్టీల్‌ప్లాంట్‌ లోపలికి వాల్యుయేషన్‌ అడ్వైజర్‌ కమిటీలను రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం నియమించిన ట్రాన్సాక్షన్‌, అడ్వైజరీ కమిటీలు స్టీల్‌ప్లాంట్‌లోకి ప్రవేశించేందుకు సహకరిస్తున్న యాజమాన్య చర్యలకు నిరసనగా 12న ఈ గేట్ల దిగ్బంధం కార్యక్రమం చేపడుతున్నట్లు పోరాట కమిటీ నాయకులు చెబుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉక్కు పరిశ్రమకు వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉక్కు రహదారులపై 3 గంటల పాటు రవాణా నిలిచిపోనుంది. దీనికి కార్మికులు, ప్రజలు సహకరించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు కార్మికులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published.